సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ కి బాలీవుడ్ నుంచి చాలా ఆఫర్లు వస్తున్నాయట. అయితే, ప్రస్తుతం సౌత్ లో తెలుగు, తమిళ ప్రాజక్టులతో బిజీగా వుండడం వల్ల హిందీ సినిమాలు ఇప్పుడు ఒప్పుకోవడం లేదనీ, అయితే బాలీవుడ్ ని మాత్రం వదలననీ అంటున్నాడు. తనకు హిందీ సినిమాలంటే ఎంతో ఇష్టమనీ చెబుతున్నాడు. సల్మాన్ ఖాన్ హీరోగా ఇటీవల వచ్చిన 'రెడీ' సినిమాలో దేవిశ్రీ పాట 'రింగ రింగా'ను 'థింక చిక' అంటూ వాడుకున్న సంగతి మనకు తెలుసు. ఆ సాంగ్ బాలీవుడ్ లో మన వాడికి చాలా పేరు తెచ్చింది.
దాంతో ఆఫర్లు వచ్చిపడుతున్నాయట. "త్వరలో ఒక హిందీ సినిమా మాత్రం చేస్తాను. ప్రస్తుతం దాని గురించి డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఆ ప్రాజక్టు నాకు నచ్చింది. వివరాలు త్వరలో చెబుతాను" అంటున్నాడు డి.యస్.పి.
దాంతో ఆఫర్లు వచ్చిపడుతున్నాయట. "త్వరలో ఒక హిందీ సినిమా మాత్రం చేస్తాను. ప్రస్తుతం దాని గురించి డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఆ ప్రాజక్టు నాకు నచ్చింది. వివరాలు త్వరలో చెబుతాను" అంటున్నాడు డి.యస్.పి.