తెలంగాణ ప్రజలను తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖరరావు మోసం చేస్తున్నారని తెలంగాణ తెలుగుదేశం ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకరరావు విమర్శించారు. రెండు వారాలలో తెలంగాణ వస్తుందని చెప్పిన కెసిఆర్ ఇప్పుడు ఆ మాట గురించి ఎందుకు మాట్లాడడం లేదని ఆయన ప్రశ్నించారు. తెలంగాణపై ఎప్పుడూ కెసిఆర్ ఏదో ఒకటి చెబుతూ ప్రజలను తప్పుదారి పట్టిస్తుంటారని ఆయన అన్నారు. కాంగ్రెస్ నాయకుల దీక్ష శిబిరానికి వెళ్లి రెండువారాలలో తెలంగాణపై కేంద్రం ఒక ప్రకట చేస్తుందని కెసిఆర్ ఏ ఆధారంతో చెప్పారని దయాకరరావు ప్రశ్నించారు.
ఇప్పటికైనా తెలంగాణ సాధనకోసం అందరు కలిసి పనిచేయాలని ఆయన అన్నారు. కేవలం ఎవరి రాజకీయ ప్రయోజనాల కోసం వారు పనిచేసుకుంటూ పోతే దానివల్ల ప్రయోజనం ఉండదని ఆయన చెప్పారు.
ఇప్పటికైనా తెలంగాణ సాధనకోసం అందరు కలిసి పనిచేయాలని ఆయన అన్నారు. కేవలం ఎవరి రాజకీయ ప్రయోజనాల కోసం వారు పనిచేసుకుంటూ పోతే దానివల్ల ప్రయోజనం ఉండదని ఆయన చెప్పారు.