తమిళనాడులో కక్షల రాజకీయాలు మళ్లీ విజృంభించాయి. తమిళనాడు మాజీ ఉప ముఖ్యమంత్రి స్టాలిన్ ను తిరువారూర్ లో అరెస్టు చేశారు. ఈయనకు ముందుగా మరో సీనియర్ మాజీ మంత్రి , డిఎమ్ కె నేత అన్బళగన్ ను పోలీసులు అరెస్టు చేశారు. కరుణానిధి ప్రవేశపెట్టిన ఏకీకృత విద్యావిదానాన్ని అమలు చేయాలని డిఎమ్ కె ఆందోళన కు పిలుపు ఇచ్చింది. అయినా ప్రభుత్వ చర్యల వల్ల డి.ఎమ్.కె అందోళన సజావుగా జరగలేదు. కాగా తిరువారూర్ లో జరిగిన ఆందోళనలో ఒక వ్యక్తి మరణించారు. తిరువారూర్ ఎమ్మెల్యే ఇందుకు బాధ్యత వహించాలంటూ ఒక కేసు నమోదైంది.
ఈ కేసు గొడవలో కొందరిని అరెస్టు చేయబోగా స్టాలిన్ చట్టం ప్రకారం వ్యవహరించాలని డిమాండు చేశారు.దీనిపై రాస్తారకో చేసిన స్టాలిన్ ను కూడా పోలీసులు అరెస్టు చేశారు కాగా సీనియర్ నేత అన్బళగన్ ను కబ్జా కేసు కింద అరెస్టు చేయడం కూడా వివాదాస్సదం అయ్యే అవకాశం ఉంది. తమిళనాడులో కక్ష రాజకీయాలు సర్వసాధారణమైపోయాయి.