బాలకృష్ణ సెట్లో నడిచివస్తుంటే.. ఆ రాముడే వస్తున్నాడేమో అనిపించింది. చేతులెత్తి నమస్కరించాలనిపింది. ఇలాంటి పాత్రలు చేయడంలో ఇప్పుడున్న వారిలో బాలకృష్ణగారే నంబర్‌వన్ అంటూ తేల్చి చెప్పారు హీరో శ్రీకాంత్. బాపూ దర్శకత్వంలో రూపొందిన ‘శ్రీరామరాజ్యం’లో శ్రీకాంత్ లక్ష్మణుడు పాత్రను చేసారు.ఈ చిత్రం పాటలు ఈ రోజు (ఆగస్ట్ 15) భధ్రాచలంలో విడుదల అవుతున్నాయి.అలాగే ఈ చిత్రం ఆడియో టీజర్స్‌ని శనివారం హైదరాబాద్‌లో విడుదల చేస్తూ ఇలా స్పందించారు.అలాగే బాపు దర్శకత్వం వహిస్తున్న పౌరాణిక చిత్రంలో నటించే అవకాశం రావడం, అందునా బాలకృష్ణగారితో కలిసి నటించే భాగ్యం కలగడం నా అదృష్టం.ఇందులో రాముడిగా బాలకృష్ణను చూస్తే ఎన్టీఆరే గుర్తొస్తారు. నా లక్ష్మణ పాత్ర విషయంలో బాలకృష్ణగారి సలహాలు నాకు చాలా ఉపకరించాయి. బాపుగారు చెప్పినట్టు చేశాను. మొన్ననే నా డబ్బింగ్ కూడా పూర్తయింది. చూసిన వారందరూ బావుంది అంటున్నారు. ఇక ఆ పాత్రకు నేను న్యాయం చేశానో లేదో ప్రేక్షకులే చెప్పాలి అన్నారు.