ఒకళ్ల సినిమాని మరొకళ్లు కొట్టేయడం అప్పుడప్పుడు మన సినిమా రంగంలో జరుగుతూనే వుంటుంది. కారణాలు ఏమైనా మొదట్లో ఒకర్ని ఎంపిక చేసుకున్నాక...మరొకళ్లు ఆ స్థానంలోకి వస్తుంటారు. ఇప్పుడు త్రిష విషయంలో కూడా అలాగే జరిగింది. 'హీరో' అనే మలయాళ సినిమాలో ముందుగా త్రిషాని కథానాయికగా బుక్ చేశారు. అయితే, ఆమె స్థానంలో ఇప్పుడు శ్రియా వచ్చి చేరింది. త్రిషాకి డేట్స్ సమస్య రావడం వల్ల ఈ సినిమా చేయలేకపోయిందని అంటున్నారు. అయితే, పారితోషికం విషయంలో తేడా రావడం వల్లే త్రిషాని డ్రాప్ చేశారని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇక శ్రియాకి మలయాళంలో ఇది మూడో సినిమా. పృద్వీరాజ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ నవంబర్లో మొదలవుతుంది.