ఒకప్పుడు తెలుగు సినిమా హీరోల మధ్య అతికినా గతకని రీలు బంధమే...తప్ప స్నేహ బంధం మాత్రం ఉండేది కాదు. పైకి సన్నిహితుల్లా మెలుగుఃతూ కటింగులిచ్చినప్పటికీ లోపల మాత్రం ఎవరి ఆలోచనలు వారిని. గత తరం హీరోలయిన చిరంజీవి, బాలయ్య, నాగార్జున, వెంకటేష్, రాజశేఖర్ తదితరులు మధ్య ఉన్న కొన్ని భేదాబిప్రాయాలే ఇందుకు నిదర్శనం.
అయితే ప్రస్తుత జనరేషన్ కు చెందిన యువ హీరోలు మాత్రం... వారిలా కాకుండా మంచి స్నేహితుల్లా మెలుగుతున్నారు. చిన్నప్పటి నుంచి ఒకే ప్రాంతంలో కలిసి పెరిగిన పరిస్థితుల ప్రభావమో? లేక ఆలోచనల్లో మార్పో? బంధుత్వ ప్రభావమో? కానీ సినిమాల విషయంలో పోటీపడుతున్నప్పటికీ ఇండస్ట్రీలో మంచి స్నేహ పూరిత వాతావరణానికి దోహద పడుతున్నారు.
ప్రస్తుత జనరేషన్ హీరోలయిన రామ్ చరణ్, అల్లు అర్జున్, దగ్గుపాటి రాణా, నాగచైతన్య, రామ్, జూనియర్ ఎన్టీఆర్ మరికొందరు యువహీరోలు పరిశ్రమలో మంచి స్నేహితులు. ఇలాంటి స్నేహ పూరిత వాతావరణం పరిశ్రమకు మంచి చేస్తాయని, గతం తరం హీరోల్లో ఇలాంటి వాతావరణం లేనందున మల్టీ స్టారర్ చిత్రాలు చాలా తక్కువగా వచ్చేవి. కానీ ఇప్పటి తరం వారిలో చాలా మార్పు వచ్చింది. ఈ పరిణామాలు టాలీవుడ్ లో సంచనలనాలకు తెరతీయవచ్చంటున్నారు. ఏది ఏమైనా వీళ్ల మధ్య స్నేహ బంధం కలకాలం విడదీయరాని బంధంగా వర్దిల్లాలని, తెలుగు సినీ పరిశ్రమకు మేలు కలగాలని ఆశిద్దాం.