స్టార్ హీరోయిన్ కాజల్ కి ఓ అభిమాని నుంచి ఊహించని ట్విస్ట్ ఎదురైంది.రీసెంట్ గా ఓ వ్యక్తి కాజల్‌కి ఫోన్ చేసి, తనో పెద్ద ఇండ్రస్టలియస్ట్ నని,ఆమెతో సినిమా తీయాలనుకుంటున్నానని చెప్పాడు. అంతేగాక ఆమె అపాయింట్మెంట్ తీసుకుని ఓ కథ కూడా వినిపించాడు. అయితే కాజల్‌కి ఆ కథ నచ్చలేదు.దాంతో మరో మంచి కథతో వస్తే తప్పకుండా సినిమా చేస్తానని మాటిచ్చింది.వెంటనే ఆ వ్యక్తి ఆమె మూడు లక్షలు రూపాయలు చెక్ రాసి అడ్వాన్స్ గా ఉంచమన్నాడు.అయితే కమిట్ కాకుండా అడ్వాన్స్ ఎందుకని కాజల్ రిజెక్టు చేసింది.అయితే పట్టుబట్టి ఆమె చేతిలో ఆ చెక్ పెట్టి అతను వెళ్ళిపోయాడు.అప్పటినుంచి కాజల్ ఆ వీరాభిమాని మళ్ళి వస్తాడు కథ వినిపిస్తాడని ఎదురు చూస్తోంది.అయితే అతను దగ్గరనుంచి ఫోన్ కూడా రాలేదు.
దాంతో కాజల్ తన మేనేజర్ తో అతనికి ఫోన్ చేయించింది.అప్పుడతను ఊహించని విధంగా మాట్లాడి షాక్ ఇచ్చాడు. అతను..‘‘నేను కాజల్ ఫ్యాన్ ని.ఆమెని ఓసారి కలిసి మాట్లాడాలనుకున్నా. ఎలా కలవాలో తెలియక సినిమా తీస్తానంటూ అపాయింట్మెంట్ తీసుకుని మాట్లాడాను.
అది చాలు నాకు అని మేనేజర్‌తో చెప్పి ఫోన్ పెట్టేశాడు.దాంతో కాజల్ ఆ చెక్ ని కూడా క్యాష్ చేసుకోవటం ఇష్టంలేక అలాగే ఉంచేసిందిట.ఆ విషయం చెప్తూ...హీరోయిన్ అయిన తర్వాత ఇలా జరగడం ఇది తొలిసారి. ఎప్పటికీ మర్చిపోలేని సంఘటన ఇది. ఆనందపడాలో, బాధపడాలో తెలియడంలేదు అంది.అదీ సంగతి.