వెంకటేష్ కీ,సురేష్ బాబుకీ విభేదాలు :CineJwala Telugu:

Posted on

యాభైల్లో పడ్డ వెంకటేష్ ఇప్పుడు డైలమోలో పడ్డాడు.ఇన్నాళ్ళూ తన అన్న సురేష్ బాబు ఆలోచనలు,ఐడియాలతో కెరీర్ ని ముందుకు తీసుకు వెళ్ళిన వెంకటేష్ కి వరసగా ప్లాప్ లు రావటంతో అర్దం కాని పరిస్దితి నెలకొంది.దాంతో సాధారణంగా తనను చెయ్యపట్టుకుని నడిపించే అన్నగారి వైపు అనుమానం చూపు పడుతుంది.మరో ప్రక్క వెంకటేష్ కి తారా జమీన్ పర్ లాంటి చిత్రాలు తీసి అమీర్ ఖాన్ లా విభిన్న చిత్రాల నటుడుగానూ పేరు సంపాదించాలని ఉంది.అయితే సురేష్ బాబు కి మాత్రం సేఫ్ గేమ్ ఆడాలనే ఆలోచన ఉంది.డబ్బు ఇన్వాల్స్ అయి ఉన్న ప్రొడక్షన్ లో చాలా జాగ్రత్తగా దిగాలనేది ఆయన సిద్దాంతం.అలా భయపడుతూ అస్సలు సినిమాలే తీయకుండా ఎంతకాలంఉంటామన్నది సురేష్ ప్రొడక్షన్స్ చాలా కాలంగా ఎదుర్కొంటున్న ప్రశ్న.
వెంకటేష్ తండ్రి రామానాయుడు మాత్రం వీటికి అతీతంగా సినిమాలు తీస్తూ వెళ్థున్నారు.లాభం,నష్టం కన్నా సినిమా అనేది ఓ కళా రూపంగా ఆయన భావిచటం వల్లే ఏధో ఒక సినిమా వస్తోంది.ఈ నేపధ్యంలో వెంకటేష్ తను సొంతంగా ఓ బ్యానర్ పెట్టాలని నిర్ణయించుకున్నారు.కొత్త ఆలోచనలును ఇంప్లిమెంట్ చేస్తూ విభిన్న తరహా చిత్రాలు చేయాలనేది ఆశగా చెప్తున్నారు.ఇక సురేష్ బాబుకి ఈ ఆలోచన సుతరామూ ఇష్టంలేదని పరిశ్రమలో టాక్.దాంతో ఇద్దరిమధ్యా క్రియేటివ్ డిఫెరెన్స్ లు చోటు చేసుకున్నాయని సమచారం.

ఇక సురేష్ బాబు తన తనయుడు రానా పైన కూడా ఇప్పుడు దృష్టి పెట్టాల్సిన స్దితి.అతని కోసం కూడా ఏ ఒక్క కథా ఓకే చేయక,బయిటనుంచి ఎవరైనా నిర్మాతలు వస్తారేమే అని వెయిట్ చేసి,రానా కెరిర్ కూడా ఆడుకుంటున్నాడని చెప్పుకుంటున్నారు.అయితే సురేష్ బాబుది ప్రాక్టికల్ ధోరణి కావటంతో ఆయన ఆలోచనల్లో స్పష్టత ఉండి ఉంటుందని కొందరు సీనియర్స్ నమ్ముతున్నారు.