తెలంగాణ కు భారతీయ జనతాపార్టీ కట్టుబడి ఉందని బిజెపి జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కరి స్పష్టం చేశారు. తెలంగాణపై కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరితో వ్యవహరిస్తోందని కూడా ఆయన అన్నారు. మంగళవారం నాడు భారతీయ జనతాపార్టీ రాష్ట్ర నేతలు బండారు దత్తాత్రేయ, చెన్నమనేని విద్యాసాగరరావు, డాక్టర్ కె.లక్ష్మణ్ తదితరులు ఢిల్లీ వెళ్లి బిజెపి అద్యక్షుడు గడ్కారిని, అంతకుముందు బిజెపి అగ్ర నేత ఎల్.కె. అద్వానీని కలిసి తెలంగాణ అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తాలని విజ్ఞప్తి చేశారు.దీనిపై గడ్కారి మాట్లాడుతూ వచ్చే పార్లమెంటు సమావేశాలలో తెలంగాణ అంశాన్ని బిజెపి లేవనెత్తుతుందని చెప్పారు. కాగా అద్వాని కూడా బిజెపి గతంలో మూడు రాష్ట్రాలు ఇచ్చిందని గుర్తు చేశారు.విశేషం ఏమిటంటే అధ్వానినే రెండువేల రెండులో తెలంగాణ ఏర్పాటు ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ ఆనాటి బిజెపి ఎమ్.పి నరేంద్ర కు లేఖ రాశారు.
వెనుకబడిన ప్రాంతాల అభివృద్దికి ప్రణాళికాబద్దమైన అభివృద్ది, వనరుల పెంపుదల వంటివి ముఖ్యమని చెప్పారు. ఆ తర్వాత అద్వాని తెలంగాణపై వైఖరి మార్చుకున్నారు.అయితే ఇప్పుడు ఈయన ఒక మాట చెబుతున్నారు. చంద్రబాబు ఒప్పుకుని ఉంటే అప్పుడే తెలంగాణ ఇచ్చేవారమని, మూడు రాష్ట్రాలు ఇచ్చినప్పటి పరిస్థితి గురించి అద్వాని చెబుతున్నారు. ఇప్పటికైనా ఇంత సీనియర్ నేతలు గతంలో తాము మాట మార్చుకుని తప్పు చేశామనో, లేక ఇకపై మాట మార్చమనో చెప్పి తెలంగాణ పై విస్పష్ట ప్రకటన చేస్తే మంచిది. లేకుంటే మళ్లీ ఎన్.డి.ఎ అధికారంలోకి వచ్చినా, ఎవరైనా చిన్న రాష్ట్రాలు వ్యతిరేకించే రాష్ట్రాలు ఉంటే మళ్లీ కధ మొదటికి వచ్చినట్లవుతుంది. కాంగ్రెస్,బిజెపిలు దీనిని ఒక ఓట్ల గేమ్ గా మార్చాయి.