కర్నూలు జిల్లాలోని మంత్రాలయం సంప్రదాయాన్ని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఉల్లంఘించారు. శనివారం కర్నూలు జిల్లాలో ఓదార్పు యాత్ర నిర్వహించిన జగన్ మంత్రాలయంలోని రాఘవేంద్ర స్వామిని దర్శించుకున్నారు. సంప్రదాయం ప్రకారం చొక్కా విప్పేసి భక్తులు రాఘవేంద్ర స్వామిని దర్సించుకోవాల్సి ఉంటుంది.
అయితే చొక్కా విప్పడానికి జగన్ నిరాకరించారు. మఠం అధికారులు చెప్పిన మాటలను పెడచెవిన పెట్టి ఆయన సాధారణ క్యూలైన్లో వెళ్లి రాఘవేంద్ర స్వామిని దర్శించుకున్నారు. జగన్ భద్రతా సిబ్బంది కూడా బూట్లతో లోనికి ప్రవేశించినట్లు వార్తలు వచ్చాయి.