చెల్లి నుంచి పోటీ ఎదుర్కొంటున్న తార :CineJwala Telugu:

Posted on

ఇంతవరకు ఒక్క హిట్ కూడా లేకపోయినా కూడా, కమలహాసన్ కూతురు శృతి హాసన్ ఎడాపెడా సినిమాలు చేస్తూ, హీరోయిన్ గా తన ఉనికిని చాటుకుంటోంది. ఇతర హీరోయిన్లకు పోటీ ఇచ్చే స్థాయిలో కూడా వుంది. అయితే, ఇప్పుడీ అమ్మాయికి హఠాత్తుగా సొంత చెల్లి నుంచే పోటీ మొదలయ్యే సూచనలు కనపడుతున్నాయి. కమల్ రెండో కూతురు అక్షర హాసన్ తను కూడా నటనను కెరీర్ గా ఎంచుకుంటానని చెబుతోంది. పైగా, తన అక్కలా ఫ్లాప్ సినిమాతో ఎంట్రీ ఇవ్వననీ, తన ఎంట్రీ అదిరిపోయే రీతిలో వుంటుందనీ చెబుతూ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.
ఓ బాలీవుడ్ సినిమా ద్వారా అక్షర ఎంట్రీ ఇవ్వడానికి ట్రై చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఈమధ్య ముంబైలో పలు సినిమా ఫంక్షన్లలో కనిపిస్తూ, దర్శక నిర్మాతలని ఆకర్షించే పనిలో వుంటోంది కూడా. ఇలా చెల్లి చేస్తున్న హడావిడి చూసి కంగుతింటున్న శృతి, ఆమెను నిలువరించే పని చేస్తోందట. 'హీరోయిన్ గా నేను కాస్త సెటిల్ అయ్యాక... నువ్వొస్తే బాగుంటుందే తల్లీ' అంటూ గెడ్డం పట్టుకుని బ్రతిమాలుతోందట. అక్షర మాత్రం వినే మూడ్ లో లేదు. 'నా  కెరీర్ నా ఇష్టం' అంటూ స్పీడుగానే వుంది!