గత కొన్నేళ్లుగా బుల్లితెరకే పరిమితమైన ప్రముఖ నటి రాధిక, మళ్లీ చాలా కాలం గ్యాప్ తర్వాత వెండితెరకు వస్తోంది. తాజాగా ఓ తమిళ సినిమాలో నటించేందుకు ఆమె అంగీకరించింది. 'ఆవారా' ఫేం కార్తీ కథానాయకుడుగా నటించే 'శకుని' చిత్రంలో ఓ కీలక పాత్ర పోషించేందుకు ఆమె సైన్ చేసింది. ఇది నెగటివ్ ఛాయలతో సాగే పాత్ర అని తెలుస్తోంది. "సినిమాలలో తిరిగి నటించాలని గత కొంత కాలంగా ఎదురుచూస్తున్నాను. అయితే, సరైన ఆఫర్లు రాలేదు.
ఇప్పుడిందులో చాలెంజింగ్ క్యారెక్టర్ చేస్తున్నాను. ఇలాంటి పాత్రతోనే నా రీ- ఎంట్రీ జరగాలని కోరుకున్నాను" అంటోంది రాధిక. ఇందులో తనది పూర్తి నిడివి పాత్ర అనీ, తనకు, కార్తీకి మధ్య వచ్చే సన్నివేశాలను ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారని ఆమె చెబుతోంది. ఈ సినిమా తర్వాత నటిగా ఆమె మళ్లీ బిజీ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.