ఈవేళ ఇటు తమిళం, అటు హిందీ భాషల్లో ప్రముఖ దర్శకుడుగా రాణిస్తున్న ప్రభుదేవా తొలుత కొరియోగ్రాఫర్ అన్న సంగతి మనకు తెలుసు. ఆ తర్వాత తమిళ దర్శకుడు శంకర్ అతనిని కాదలన్ (ప్రేమికుడు) చిత్రం ద్వారా హీరోగా మార్చేశాడు. దాంతో, కొన్ని చిత్రాలలో కథానాయకుడుగా నటించి పేరు తెచ్చుకున్నాడు. అయితే, ఇప్పుడు దర్శకుడయ్యాక మళ్లీ నటించడం తగ్గించేశాడు. ఇదే విషయం అడిగితే, ఇక ఆర్టిస్టుగా మారే ఆలోచన లేదని అంటున్నాడు.
"ఇప్పటికే దర్శకుడిగా యమా టెన్షన్ పడుతున్నాను. మళ్లీ హీరోగా కూడా మొదలెట్టాననుకోండి... ఆ టెన్షన్ రెట్టింపవుతుంది. అది నా వల్ల కాదు. ఆ టెన్షన్ భరించలేను. అందుకని, హీరోగా ఇక కెమెరా ముందుకు రావడం కష్టమే" అంటున్నాడు ప్రభు. ప్రస్తుతం విశాల్, సమీరారెడ్డి జంటగా రూపొందుతున్న 'వెడి' సినిమా షూటింగ్ పనిలో ప్రభు కోల్ కత్తాలో బిజీగా వున్నాడు.