బంద్‌లపై ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని కొట్టేసిన హైకోర్టు :CineJwala Telugu:

Posted on

తెలంగాణ సమైక్యాంధ్ర రాష్ట్రాల ఉద్యమాల్లో భాగంగా జరుగుతున్న ఆందోళనలను బంద్‌లను నిరోధించేలా ప్రభుత్వాన్ని డీజీపీని ఆదేశించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు శుక్రవారం కొట్టివేసింది. బంద్‌లు ఆందోళనలు నిర్వహించవద్దని ఆందోళనకారులకు తామెలా చెప్పగలమని పిటిషనర్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నిసార్ అహ్మద్ కక్రూ నేతృత్వంలోని ధర్మాసనం ప్రశ్నించింది.



విశాఖకు చెందిన ఎ.వి వేణుగోపాలరావు దాఖలు చేసిన ఈ వ్యాజ్యాన్ని విచారించిన ధర్మాసనం.. ఆందోళనల వల్ల ఇబ్బందులు ఉంటే వాటిని ప్రభుత్వం అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని పిటిషనర్‌కు సూచించింది.