విక్కీదాదా’ నుంచి ‘రగడ’ వరకు కింగ్ నాగార్జునతో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన కామాక్షి ఎంటర్ ప్రైజెస్ అధినేత, అగ్ర నిర్మాత డి.శివప్రసాద్ రెడ్డి, నాగర్జున హిరోగా మరో భారీ చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ చిత్రం షూటింగ్ జనవరి నుంచి ప్రారంభంకానుంది. ఈ చిత్రం గురించి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘ నాగార్జున గారితో కామాక్షి బేనర్ లో జనవరి నుంచి మరో భారీ చిత్రాన్ని ప్రారంభిస్తున్నాం. ఓ ప్రముఖ దర్శకుడు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు.
ఆగస్ట్ 12న నాగచైతన్య ‘దడ’ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నాం. ఆగస్టు చివరి వారంలో నాగర్జున గారి చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియచేస్తామని’’ అన్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన స్ర్కీప్ట్ వర్క్ జరుగుతోంది.