అందం, అభినయమే కాదు... తీరైన చీర కట్టు కూడా అవకాశాలు తెచ్చిపెడుతుందని ఇప్పుడు శ్రియాను చూస్తే తెలుస్తోంది. ఎందుకంటే, ఆమె చీర కట్టు ఈమధ్య ఆమెకు ఓ సినిమాలో అవకాశాన్ని తెచ్చిపెట్టింది. చీర కట్టులో ఆమె ఎంతో సంప్రదాయబద్ధంగా, సౌందర్యవంతంగా వుంటుందని భావించిన తమిళ దర్శకుడు గోకుల్, ఓ నిర్మాతకు రికమెండ్ చేయడంతో 'రౌత్తిరం' అనే తమిళ సినిమాలో శ్రియాను సెలెక్ట్ చేశారు.
ఆ సినిమాలో హీరోయిన్ సంప్రదాయబద్ధంగా చీర కడుతుంది. అందుకని చీర కట్టులో ఆమెను చూసి, ముచ్చటపడిన దర్శకుడు గోకుల్ ఆమెను ఎంపిక చేసుకున్నాడు. జీవా సరసన శ్రియా హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం తెలుగులో 'రౌద్రం' పేరుతో విడుదల కానుంది. ఈ సినిమా తనకు మంచి పేరు తెస్తుందని ఆమె చాలా ఆశలు పెట్టుకుంది. ఆగష్టులో రిలీజ్ కానున్న ఈ సినిమాతో, తనకు సౌత్ లో మళ్లీ పూర్వ వైభవం వస్తుందని నమ్మకంగా వుందీ డిల్లీ భామ.