ప్రఖ్యాత సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఫేస్బుక్లో 'కిరణ్ కుమార్ రెడ్డి నల్లారి- ఆంధ్రప్రదేశ్ సీఎం' పేరుతో ఉన్న అకౌంట్ ముఖ్యమంత్రికి ఎలాంటి సంబంధంలేదని సీఎం కార్యాలయం స్పష్టం చేసింది. అనుమతి లేకుండా ఎవరో ప్రైవేటు వ్యక్తులు సీఎం పేరుతో ఫేస్బుక్లో అకౌంట్ తెరిచారని ఒక ప్రకటనలో తెలిపింది.
అయితే ప్రజలకు చేరువై ప్రజా సమస్యలు పరిష్కరించడానికి త్వరలో 'ఫేస్బుక్' ద్వారా ప్రజల ముందుకు వచ్చే ఆలోచన మాత్రం ఉందని.. ఆ ప్రక్రియ ప్రారంభించేటప్పుడు అధికారికంగా ప్రకటిస్తామని వివరించింది
అయితే ప్రజలకు చేరువై ప్రజా సమస్యలు పరిష్కరించడానికి త్వరలో 'ఫేస్బుక్' ద్వారా ప్రజల ముందుకు వచ్చే ఆలోచన మాత్రం ఉందని.. ఆ ప్రక్రియ ప్రారంభించేటప్పుడు అధికారికంగా ప్రకటిస్తామని వివరించింది