అనూష్క రంపచోడవరం ఏమైంది? :CineJwala Telugu:

Posted on

అనూష్క ఆ మధ్యన‘రంపచోడవరం’అనే టైటిల్ తో ఓ చిత్రం కమిటైందనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.అయితే ఆ తర్వాత ఆ సినిమా గురించి వార్తలు రాలేదు.అయితే ఆ చిత్రం కథ విన్న అనూష్క ఓరల్ గా ఓకే చేసింది కానీ ఇంకా డేట్స్ కేటాయించి ఎగ్రిమెంట్ రాయలేదు.నిర్మాత,దర్సకుడు ఆమె సైన్ కోసం ఎదురుచూస్తున్నారు.అయితే ఆమె రీసెంట్ గా సెల్వరాఘవన్ దర్సకత్వంలో సినిమా చేయటానికి ఓకే చేసింది.దాంతో ఆమె డేట్స్ ఎప్పుడు ఇస్తుందో అనే ఆలోచన వారిలో మొదలైంది.

ఇక ఈ చిత్రం 1930 లో బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా గెరిల్లా పోరాటం సాగించిన ఓ యోధురాలి కథ ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో ఆమె అడవుల్లో ఉండి పోరాటం చేసే వీరనారిగా కనిపిస్తుంది. ఈ చిత్రాన్ని ‘బాణం’ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన చైతన్య దంతులూరి డైరక్ట్ చేస్తున్నారు. నాగార్జునతో శ్రీరామదాసు చిత్రం నిర్మించిన కొండా కృష్ణంరాజు నిర్మిస్తున్నారు.
జే.కే.భారవి రచన చేస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. అరుంధతి తరహాలో పూర్తిగా ఆమె చుట్టూ తిరిగే ఈ కథ తో ఆమె తనను తాను మరోసారి ప్రూవ్ చేసుకోవటానికే ఓకే చేసిందంటున్నారు. ఇక ఈ పీరియడ్ డ్రామాని దంతులూరి చైతన్య చేతిలో పెట్టడానికి కారణం అతను బాణం చిత్రాన్ని కూడా గత కాలంలో జరిగే కథగా రియాలిటీ దగ్గరగా ఉండేలా తీర్చిదిద్దటమేనంటున్నారు. ఇక ఈ చిత్రం తెలుగు,తమిళం,మళయాళం బాషల్లో తెరకెక్కనుంది.