అలా మొదలైంది జంట నిత్యామీనన్, నాని కాంబినేషన్ లో వస్తున్న మరో చిత్రం సెగ. ఈ చిత్రం ఈ రోజు(శుక్రవారం)విడుదల అవుతోంది.కథలో నాని కార్తిక్ అనే మధ్య తరగతి కుర్రాడిగా కనిపిస్తాడు. కాలేజీలో చదువుతున్న కార్తీక్ (నాని)చాలా సరదాగా జీవితాన్ని గడుపుతుంటాడు. రేవతి (నిత్య మీనన్)... జిరాక్స్ సెంటర్ లో పని చేసే అమ్మాయి. కార్తీక్, రేవతిల ఆలోచనలు ఎప్పుడూ ఒకేలా ఉంటాయి. వీలైనంత త్వరగా కోటీశ్వరలు కావాలనేది వారి కల. వాళ్లకు మరో ముగ్గురు స్నేహతులు తోడవుతారు. అందరూ కలిసి ఏం చేశారు? వారి లక్ష్యం నెరవేరిందా లేదా? అనే విషయాల్ని తెరపైనే చూడాలి.
ఇక ఈ చిత్రం గురించి నాని మాట్లాడుతూ...మురికివాడల నేపథ్యంలో సాగే వాస్తవిక చిత్రమిది. ఇందులో హీరోలంటూ ఎవరూ లేరు. కేవలం పాత్రలు మాత్రమే కనిపిస్తాయి. జోష్వా శ్రీధర్ సంగీతం ప్రధాన బలం అన్నారు. ఇక ఈ చిత్రం ద్వారా అంజన అనే మహిళా దర్శకురాలు పరిశ్రమకు పరిచయమవుతోంది. గౌతమ్ మీనన్ శిష్యురాలైన అంజన ఈ చిత్రాన్ని పూర్తి వాస్తవిక వాతావరణంలో చిత్రీకరించిందని తెలుస్తోంది. నిత్యామీనన్ సైతం సిద్దార్ద తో చేసిన 180 చిత్రం ఫెయిల్యూర్ అవటంతో ఈ సినిమాపైనే నమ్మకాలు పెట్టుకుంది. రిలీజ్ కు ముందే టేబుల్ ప్రాఫెట్ చూసిన ఈ చిత్రం తమకీ లాభాలు పంట తెచ్చిపెడుతుందని ఎగ్జిబిటర్స్ సైతం నమ్ముతున్నారు.