గత కొంత కాలం నుంచి తెలుగు తమిళ భాషల్లో విజయవంతమైన చిత్రాల రైట్స్ కోసం కథానాయకులు పోటీపడి తీసుకొని రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే దక్షిణాదిలో పేరుతెచ్చుకున్న కథానాయికలని బాలీవుడ్ తెరకు పరిచయం చేయడానికి కూడా ఉత్తరాది దర్శక నిర్మాతలు పోటీపడుతున్నారు. ఇది ఇలా వుంటే.. బాలీవుడ్ నిర్మాతల దృష్టి ప్రస్తుతం తెలుగు కథానాయకులపై పడింది. బాలీవుడ్లో దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే మొహబ్బతే వీర్-జారా ధూమ్ ధూమ్-2 �రబ్నే బనాదీ జోడీ� వంటి విజయవంతమైన చిత్రాలని అందించిన ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ యష్‌రాజ్ ఫిలింస్ త్వరలో నిర్మించనున్న ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ కోసం తెలుగు క్రేజీ హీరో అల్లు అర్జున్‌కు భారీ ఆఫర్ ఇచ్చిందట.
ప్రస్తుతం ఈ విషయం తెలుగు చిత్ర పరిక్షిశమలో చర్చనీయాంశంగా మారింది. అయితే తెలుగులో అల్లు అర్జున్ నటించబోయే కొత్త చిత్రాలు చర్చల దశలో వుండటం ఇప్పటికే ఆయన కొన్ని చిత్రాలు అంగీకరించడంవల్ల యష్‌రాజ్ ఫిలింస్ సంస్థ ఇచ్చిన ఆఫర్‌ని ఆయన సున్నితంగా తిరస్కరించాడని తెలుస్తోంది. కానీ బాలీవుడ్ అగ్రనిర్మాణ సంస్థల్లో ఒకటైన యష్‌రాజ్ ఫిలింస్ సంస్థ ఆఫర్‌ని అర్జున్ అంత తేలిగ్గా వదులుకోడని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా వెల్లడవుతాయని అల్లు అర్జున్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.