కొత్త ముఖ్యమంత్రి రేసులో ఉన్నట్లు పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎడ్యూరప్ప కేబినెట్లో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా వున్న జగదీష్ షెట్టర్ ఈ పోటీలో ముందున్నట్లు తెలుస్తోంది. పోటీలో ఉన్న మిగిలిన వారు...
ఈశ్వరప్ప : ప్రస్తుతం బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. జాతీయ స్థాయిలో ఈయన పేరు కూడా ఎవరికీ తెలియకపోవటం విశేషం.
సదానందగౌడ : పార్టీ రాష్ట్ర కమిటీ మాజీ అధ్యక్షుడు. ఎటువంటి వివాదాలూ లేని వ్యక్తి.
ఎంపి అనంత్‌కుమార్ : ఎడ్యూరప్పకు పక్కలో బల్లెంలా వ్యవహరిస్తున్న పార్లమెంట్ సభ్యుడు. బయటకు మాత్రం ఎడ్యూరప్పతో చెట్టాపట్టాలేసుకు తిరుగు తుంటారు.
విఎస్ ఆచార్య : మాజీ హోంమంత్రి అయిన ఆచార్య ఎడ్యూరప్పకు నమ్మిన బంటు. గతంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న వ్యక్తి.
శోభా కరండ్లాజే : వాస్తవానికి ఎడ్యూరప్ప వారసత్వ పోటీలో ఈమె పేరు లేదు. అంతేకాక ఎడ్యూరప్పతో ఉన్న సాన్నిహిత్యం ఆమెకు ప్రతికూలించే అవకాశాలు లేకపోలేదు