తమిళ మాజీ స్టార్ హీరో శరత్ కుమార్ రీసెంట్ గా 'కాంచన' చిత్రంలో కీలకమైన హిజ్రా పాత్రలో శరత్ కుమార్ నటించాడు.రాఘవ లారెన్స్ దర్సకత్వంలో విడుదలైన ఈ చిత్రం మంచి టాక్ నే తెచ్చుకుంది.అయితే ఈ టాక్ పాపం శరత్ కుమార్ కి తలనొప్పిగా మారింది.హిజ్రాగా ఆయన చేసిన పాత్ర గురించే ఎక్కడికి వెళ్లిమా మాట్లాడుతున్నారు.మొదట్లో ఆయనలోని నటుడు హ్యాపీ ఫీలైనా తర్వాత ఆయన ఫ్యాన్స్ కొందరు హిజ్రాగా చేయవద్దంటూ మెసేజ్ లు పంపటంతో బాధపడ్డాడని చెప్తున్నారు.అయితే అదే సమయంలో లారెన్స్ ఆయన్ని ప్రమోషన్ నిమిత్తం టీవీలు,పేపర్లు అంటూ తిప్పుతున్నారు.
ఆ సందర్భంగా శరత్ కుమార్ మాట్లాడుతూ..'దాదాపు 128 సినిమాల్లో నటించిన తర్వాత 'కాంచన' చిత్రంలో తొలిసారిగా హిజ్రా పాత్రలో నటించాను. నిజంగా ఆ పాత్ర నాకు సవాల్‌గా నిలిచింది. గతంలో నేను చేయని విధంగా ఆ పాత్రకు వైవిధ్యమైన బాడీ లాంగ్వేజ్ అవసరం. అంతకు మునుపు మహిళా వస్త్రధారణతో నేను పలు చిత్రాల్లో నటించినప్పటికీ ఈ పాత్ర తీరుతెన్నులు పూర్తిగా భిన్నమైంది.అలాగే ప్రతిభావంతులైన యువ దర్శకుల్లో రాఘవ లారెన్స్‌కు ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. లారెన్స్ తెలుగులో తీస్తున్న తర్వాతి చిత్రంలో కూడా నేను నటిస్తున్నాను అన్నారు.