దర్శకత్వం మానేద్దామని అనుకున్నా. -వి.వి.వినాయక్ :CineJwala Telugu:

Posted on

బద్రినాథ్‌ విడుదలైన మూడు రోజులు చాలా భయపడ్డాను. ఆటైమ్‌లో ఇక దర్శకత్వం మానేయాలని కూడా అనుకున్నాను. కానీ మూడు రోజుల తర్వాత సినిమా కలెక్షన్స్ చూసి ధైర్యమొచ్చింది. ఎంతో కష్టపడి బన్నీని చాలా గొప్పగా చూపించాలని చేసిన చిత్రమిది. బన్నీ చాలా కష్టపడి ఈ చిత్రంలో నటించాడు. వందరోజులు ఆడే దమ్మున్న చిత్రమిది అని దర్శకుడు వి.వి.వినాయక్ అన్నారు. ఆయన దర్శకత్వంలో అల్లు అర్జున్ తమన్నా జంటగా గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మించిన చిత్రం బవూదినాధ్. ఈ చిత్రం 187 సెంటర్లలో 50రోజులు పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో శుక్రవారం రాత్రి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ  బన్నీని చాలా గొప్పగా చూపించాలనే కోరికతో ఈ చిత్రాన్ని నిర్మించాను. అది నెరవేరినందుకు ఆనందంగా వుంది. సినిమా విజయం కోసం ప్రతి ఒక్కరు కష్టపడ్డారు. మా కష్టం ఫలించింది అన్నారు. అల్లు అర్జున్ మాట్లాడుతూ  కష్టపడితే తప్పకుండా ఫలితం వుంటుందని నమ్ముతాను.
నేను నమ్మినట్టుగానే మా కష్టం ఫలించి సినిమా విజయం సాధించడం ఆనందంగా వుంది. హీరోగా నా స్థాయిని పెంచిన చిత్రమిది. ఈ సినిమా ఈస్థాయిలో విజయం సాధించడానికి వినాయక్ కారణం అన్నారు. తమన్నా మాట్లాడుతూ  ఈ చిత్రం కోసం అర్జున్ చాలా కష్టపడ్డారు. ఆయన కష్టం చూసి నేను తనకు పెద్ద అభిమానినయ్యాను. ఈ చిత్రం నా కెరీర్‌లో మర్చిపోలేని అనుభూతినిచ్చింది  అన్నారు. ఇంకా ఈ కార్యక్షికమంలో ఠాగూర్ మధు చిన్నికృష్ణ రాజేంవూదకుమార్ ఆనంద్‌సాయి తదితరులు పాల్గొన్నారు.