గంగోత్రి బద్రినాథ్ చిత్రాల తర్వాత చిన్నికృష్ణ మరో కథ సిద్ధం చేశాడు. త్వరలో ఇది ఫైనల్ అవుతుందని నిర్మాత అల్లు అరవింద్ తెలిపారు. వినాయక్ దర్శకత్వం వహించిన 'బద్రీనాథ్' 187 సెంటర్లలో యాభై రోజులు పూర్తిచేసుకుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని అరవింద్ మాట్లాడుతూ...'బన్నీ బాగా చేశాడని అందరూ అంటుంటే తండ్రిగా చాలా గర్వపడుతున్నా. ఈ సినిమాకోసం దర్శకుడు వినాయక్ అందర్నీ బాగా కష్టపెట్టాడు. ఇంత మంచి విజయం సాధించిందంటే కారణమూ ఆయనే. అందుకు అభినందలు' అని అన్నారు.
ఎంతో భక్తిశ్రద్ధలతో ఈ సినిమా సినిమా చేశానని నా సినీ కెరీర్లో డబుల్ కలెక్షన్లు నమోదు చేసుకున్న సినిమా ఇదని ఇందుకు కారణమైన దర్శకులు వినాయక్ అని అల్లు అర్జున్ అన్నారు. త్వరలో బన్నీకి మరో కథ సిద్ధం చేశానని వినాయక్ దర్శకత్వం వహిస్తే బాగుంటుందని కథా రచయిత చిన్న కృష్ణ అన్నారు.