బిల్లా -2 చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మంగాత్తా తర్వాత అజిత్ నటిస్తున్న చిత్రం బిల్లా-2. గతంలో వచ్చిన బిల్లాకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఉన్నైపోల్ ఒరువన్ ఫేమ్ చక్రి తోలేటి దర్శకత్వం వహిస్తున్నారు. అజిత్ కు జంటగా ముంబయి మోడల్ హియుమా కురేచీ నటిస్తున్నారు. ముఖ్య పాత్రల్లో బాలీవుడ్ నటుడు సుధన్సు పాండే, ప్రుణా అబ్దుల్లా, మలయాళ నటుడు మనోజ్ కె జయన్ నటిస్తున్నారు.
ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. గోవా, తూత్తుకుడి తదితర ప్రాంతాల్లో షూటింగ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. కీలక సన్నివేశాలను, పాటలను రష్యాలో చిత్రీకరించనున్నట్లు చెప్పారు. మంగాత్తా చిత్రం ఈ నెలాఖరున విడుదలకు సిద్ధమవుతోంది. బిల్లా-2ను దీపావళికి విడుదల చేయాలని హీరో అజిత్ భావిస్తున్నట్లు సమాచారం.