తెలుగు తెరపై స్వర్గీయ ఎన్టీ రామరావు ఓ వెలుగు వెలిగారు. పౌరాణికాలతో తెలుగు ప్రేక్షకుల నీరాజనాలు అందుకుని నెంబర్ స్థానంలో నిలిచారు. అదే వూపుతో రాజీయాల్లోనూ ప్రభంజనం సృష్టించారు. రాజకీయాల సంగతి పక్కన పెడితే ఎన్టీఆర్ తర్వాత ఆయన స్థానాన్ని దక్కించుకునేందుకు....అప్పటి యువ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌లు పోటీ పడ్డారు. అయితే తెలుగు స్టార్స్ అందరినీ వెనక్కి నెట్టి మెగాస్టార్ గా నెంబర్ స్థానంలో నిలిచారు చిరంజీవి. తండ్రి వారసత్వం ఉన్నప్పటికీ బాలయ్య రెండో స్థానంతోనే సరి పెట్టు కోవాల్సి వచ్చింది.
ప్రస్తుత విషయానికొస్తే...చిరంజీవి సినిమాలను వదిలి పెట్టి రాజకీయాల్లోకి దిగారు. అప్పటి నుంచి ఇండస్ట్రీలో నెం.1 స్థానం ఖాళీ అయింది. ఈ తరం యువహీరోలను పక్కన పెడితే.... నలుగురు అగ్రహీరోల్లో మిగిలింది బాలయ్య, నాగార్జున, వెంకటేష్ మాత్రమే. ఈ పోటీపై వెంకటేష్ పెద్దగా ఆసక్తి చూపక పోయినప్పటికీ బాలయ్య, నాగార్జునలు భారీ సినిమాలతో ఆ స్థానం కోసం పోటీ పడుతున్నారు.
అయితే...అందరినీ వెనక్కి నెట్టి చిరంజీవి సీటు దక్కించుకునే ప్రయత్నంలో ఉన్నారు బాలయ్య. తండ్రికి తగ్గ వారసుడిగా నెం.1 స్థానాన్ని ఒక్కసారైనా ఏలాలనేది బాలయ్య చిరకాల కోరిక. అందుకే ...‘బొబ్బిలి పులి’ లాంటి సినిమాలతో తన తండ్రి ఆ స్థానికి ఎదగడంలో కీలక పాత్ర పోషించిన దాసరితో ‘పరమ వీర చక్ర’ ప్లాన్ చేశాడు. పాపం...బాలయ్య వ్యూహం బెడిసి కొట్టి పరమ ప్లాప్ సినిమా అయింది. దీంతో తన తండ్రిని నెం.1 స్థానంలో నిలిచిన పౌరాణికాల వైపు దృష్టి సారించాడట బాలయ్య. బాపు దర్శకత్వంలో ‘శ్రీరామ రాజ్యం’ సినిమా చేసేఃది అందుకేనట. మరి నెం.1 కావాలనే బాలయ్య చిరకాల కోరిక ఇప్పటికైనా తీరుతుందో..? లేదో..?