కమెడియన్ గణేష్ నిర్మాతగా మారి టాలీవుడ్ లో సంచలనాలే సృష్టిస్తున్నాడు. తొలి చిత్రమే రవితేజతో చేసిన అందర్నీ ఆశ్చర్య పరిచాడు గణేష్. అంతకుముందే పవన్ కళ్యాణ్ తో పూరి డైరెక్షన్ లో ఓ సినిమా చేయబోతున్నానని, అదే నిర్మాతగా తొలి చిత్రమవుతుందని గణేష్ అప్పట్లో చెప్పినా, మొదటగా గణేష్ నుంచి వచ్చిన సినిమా రవితేజదే అయ్యింది. అన్నమాట ప్రకారం పవన్ కళ్యాణ్ తో ‘తీన్ మార్’ సినిమా చేశాడు గణేష్ . తీన్ మార్ తర్వాత కూడా పూరి డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ హీరోగా ఓ సినిమా తీస్తానని ప్రకటించినా, ఆప్రాజెక్ట్ స్థానంలో ‘గబ్బర్ సింగ్’ వచ్చి చేరింది. పవన్ గణేష్ కాంబినేషన్ లో వస్తోన్న మరో సినిమా ఇదే...
తాజాగా హాస్య నటుడు గణేష్ ఒక్కసారిగా జూ ఎన్టీఆర్ తో రెండు సినిమాలు నిర్మిస్తూ ఇప్పుడు వార్తల్లోకెక్కాడు. నిన్న జూ ఎన్టీఆర్, పూరీ జగన్నాథ్ ల కాంబినేషన్లో ఓ సినిమా ప్రకటించిన గణేష్, ఈ రోజు జూ ఎన్టీఆర్, శ్రీను వైట్ల కాంబినేషన్లో మరో సినిమా అనౌన్స్ చేశాడు. తమ పరమేశ్వరా ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని యాక్షన్ ఎంటర్ టైనర్ గా నిర్మిస్తున్నాడు.
దీని గురించి జూ ఎన్టీఆర్ చెబుతూ, ‘ఈ కథ చాలా ఇన్స్ పైరింగ్ గా వుంది. మా ఫస్ట్ కాంబినేషన్లో వచ్చే ఈ సినిమా ది బెస్ట్ అనిపించుకుంటుంది. ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరెక్షన్లో నేను చేస్తున్న సినిమా పూర్తయిన వెంటనే ఇది ప్రారంభమవుతుంది’ అన్నారు. శ్రీను వైట్ల చెబుతూ, ‘జూ ఎన్టీఆర్ తో తొలిసారిగా చేస్తున్నందుకు చాలా ఎగ్జైటింగ్ గా వుంది. నా సినిమాల్లో వుండే ఎంటర్ టైన్మెంట్ వుంటూనే, జూ ఎన్టీఆర్ ఇమేజ్ కి తగ్గట్టుగా రూపొందుతుంది. దూకుడు తర్వాత నేను చేయబోయే సినిమా ఇదే’ అన్నారు.
మొత్తానికి టాలీవుడ్ లో టాప్ ప్రొడ్యూసర్స్ లిస్ట్ లో చేరిపోవాలని తహతహలాడుతున్న గణేష్, ఇప్పటికైతే సెన్సేషనల్ కాంబినేషన్స్ రూపొందించడంలో దిట్ట అన్పించుకుంటున్నాడన్నమాట.