ఇప్పటి వరకూ యాక్షన్ చిత్రాలు చేస్తూ యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకున్న గోపీచంద్ తొలిసారిగా తన పంథాను మార్చి ఓ కుటుంబ కథా చిత్రాన్ని చేస్తున్నాడు. అయితే ఇందులో కూడా ఆయన మార్క్ యాక్షన్ అంశాలు పుష్కలంగా వుంటాయని చెబుతున్నాడు దర్శకుడు కృష్ణవంశీ. ఆయన దర్శకత్వంలో గోపీచంద్, తాప్సీ, శ్రద్ధాదాస్ ముఖ్యతారలుగా రూపొందుతున్న చిత్రం ‘మొగుడు’. లక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) నిర్మిస్తోన్న ఈ చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ దశలో వుంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘మగ పుట్టుక పుట్టిన ప్రతి ఒక్కడు మగాడు కాదు. తాళికట్టిన ప్రతి వాడు ‘మొగుడు’ కాదు.
బాధ్యత తెలిసిన వాడు మగాడు అవుతాడు. మనసెరిగిన వాడు మొగుడు అవుతాడు అనే ఆసక్తికరమైన విషయాన్ని కృష్ణవంశీ ఈ చిత్రం ద్వారా చెప్పబోతున్నాడు. ఈ చిత్రం ద్వారా గోపీచంద్ కుటుంబ ప్రేక్షకులకు మరింత దగ్గరవుతాడు. ఆద్యంతం ఆసక్తికరంగా ఈ చిత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగిస్తుంది. సెప్టెంబర్‌లో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’ అన్నారు.