కథానాయిక కాజల్ ఇప్పుడిక ఓ వారం రోజుల పాటు ఎవరికీ కనపడదు. కనీసం ఫోన్ లో కూడా అందుబాటులో వుండదు. ఎందుకంటే... చాలా రోజుల తర్వాత హాలిడే తీసుకుంటోంది. ఈ హాలిడేని తన స్నేహితులతో కలిసి ఎంచక్కా రొమాంటిక్ సిటీ పారిస్ లో ఎంజాయ్ చేయనుంది. "గత కొన్నాళ్ల నుంచీ విరామం అంటూ లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ ఉండడంతో అలసిపోయాను. నాలుగేళ్లలో ఇరవై ఒక్క సినిమాలలో నటించాను. ఒక దాని తర్వాత మరొకటి... ఎక్కడా గ్యాప్ లేదు. రెస్ట్ అన్నది అసలే లేదు. దాంతో రొటీన్ అయిపోయి, లైఫ్ బోర్ కొట్టేస్తోంది. అందుకే, ఇప్పుడు వీలుచూసుకుని, ఓ వారం రోజుల పాటు ఫ్రెండ్స్ తో గడిపిరావడానికి పారిస్ వెళుతున్నాను. ఈ వారం రోజులు షూటింగులకి కాస్త దూరంగా వుంటే, మనసు కాస్త తేలికపడి, రీ చార్జ్ అవ్వచ్చు" అంటోంది కాజల్. సో... అందాల కాజల్ కి హ్యాపీ జర్నీ చెప్పేద్దాం!