కామెడీ పాత్రలు పోషించే అవకాశం కథానాయికలకు అరుదుగా వస్తుంటుంది. అందులోనూ ఫుల్ లెంత్ కామెడీ రోల్స్ అయితే మరీనూ! ఇప్పుడిలాంటి అవకాశమే మల్లూ బేబీ అసిన్ కి వచ్చింది. ప్రస్తుతం తను చేస్తున్న 'హౌస్ ఫుల్-2' హిందీ సినిమాలో అలాంటి కామెడీ పాత్రను అసిన్ చేస్తోందట. ఆమధ్య వచ్చిన 'హౌస్ ఫుల్' సినిమాకి ఇది సీక్వెల్. ఈ సినిమా పూర్తి హాస్య కథా చిత్రం. తన పాత్ర ద్వారా అసిన్ ప్రేక్షకులని కడుపుబ్బా నవ్విస్తుందట. ఇదిలా ఉంచితే, ఈ సినిమా షూటింగులో ఈ మధ్య ఓ తమాషా జరిగింది.
దాని గురించి అసిన్ చెబుతూ, "ఓ సీన్ లో నేను విరగబడి నవ్వుతూ, ముగ్గురు హీరోలనీ నవ్వించాలి. నాకేమో ఎంత సేపటికీ నవ్వు రావడం లేదు. అప్పటికే చాలా టేక్స్ చేశారు. దాంతో నా పరిస్థితి అర్ధం చేసుకున్న అక్షయ్, జాన్ అబ్రహాం, రితేష్ ఒక్క ఉదుటున నా వద్దకు వచ్చి, చక్కిలిగింతలు పెడుతూ నవ్వు తెప్పించారు. ఆ దెబ్బతో షాట్ ఓకే అయిపోయింది" అంటూ చెప్పుకొచ్చింది.