సినిమా చూసి థియేటర్ బైటికొచ్చాక కూడా వెంటాడే చిత్రాలు నేడు చాలా తక్కువ వస్తున్నాయి. మా సినిమా ఆ లోటు తీర్చుతుంది. థియేటర్‌నుంచి బైటికొచ్చాక ..స్వచ్ఛమైన ప్రేమ అంటే ఈ సినిమాలో చూపించిందేే.. అన్న భావన కలుగుతుంది అంటున్నారు ‘ప్రేమ ఖైదీ’నిర్మాత బి.సుబ్రహ్మణ్యం. విదార్థ్-అమలా పౌల్ జంటగా నటించిన చిత్రం ‘మైనా’తమిళంలో మంచి విజయం సాధించింది.. ప్రభు సాల్మన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి ‘ప్రేమ ఖైదీ’ పేరు పెట్టి తెలుగులో విడుదల చేస్తున్నారు. ‘జర్నీ ఆఫ్ లవ్’ అనే ట్యాగ్ లైన్ తో వస్తున్న ఈ చిత్రాన్ని లక్ష్మీ గణపతి ఫిలింస్ పతాకంపై బి.సుబ్రహ్మణ్యం ఇక్కడ అందిస్తున్నారు. ఈ నెల 25న విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.
అలాగే ఖైదీలైన ప్రేమికులు పోలీసుల సమక్షంలోనే తమ ప్రేమను ఆస్వాదించే సన్నివేశాలు వెంటాడేలా ఉంటాయి. దేవదాసు, లైలా మజ్ను..తరహా చిత్రమిది. తమిళనాడు-కేరళ సరిహద్దుల్లో జరిగిన ఓ యధార్థ ప్రేమకథ ఆధారంగా తెరకెక్కింది. ఇటీవల మార్కెట్లోకి విడుదలైన పాటలకు శ్రోతలనుంచి విశేష స్పందన వచ్చింది. ప్రచార చిత్రాల(ట్రైలర్స్) కు కూడా వీక్షకులను మెప్పిస్తున్నాయి. అనువాదం రాజీ లేకుండా చేశాం. వెన్నెలకంటి సాహిత్యం సినిమాకి అస్సెట్. ఎన్నో విజయవంతమైన చిత్రాలు అందించిన మా బేనర్‌లో వస్తున్న అరుదైన ప్రేమకథా చిత్రమిది. తమిళంలోలానే ఇక్కడా విజయం సాధిస్తుంది’ అన్నారు.