ప్రభుదేవా పాలిట బాలయ్య రావణుడవుతాడా? అంటే అవును అంటూ కూస్తున్నాయి కొన్ని తమిళ మ్యాగజైన్లు. బాలయ్యను రావణుడిగా నయన తారను సీతగా పోలుస్తూ కొన్ని కథనాలు వెలువరించాయి. అంతే కాదు బాలయ్య తెరపై రాముడు, తెర వెనక రావణాసురుడు అంటూ ప్రచారం మొదలు పెట్టాయి.
బాలయ్య, నయన తార కాంబినేషన్లో ‘శ్రీరామ రాజ్యం‘ సినిమా రూపొందింది. షూటింగ్ సందర్భంగా ఇద్దరి మధ్య అనుబంధం బాగా పెరిగింది. ఈ క్రమంలోనే నయన తార తన కష్ట సుఖాలను బాలయ్యకు చెప్పకుంది. నయన కష్టాలు విన్న బాలయ్య మనసు కూడా కరిగి పోయింది. దీనికి తోడు ఇటీవల శ్రీరామ రాజ్యం ఆడియో వేడుకలో....‘నయన తార ఒప్పుకోకుంటే నేనూ ఈ సినిమాలో నటించే వాన్ని కాదేమో’ అంటూ బాలయ్య చేసిన వ్యాఖ్యలు తమిళ మీడియాకు కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లయింది.
ఇంకేం ...బాలయ్య, నయన మధ్య ఏదో బంధం ముదురుతోందని, బాలయ్య రావణుడిగా మారి ప్రభుదేవా వద్ద నుంచి నయనను ఎగరేసుకు పోయే అవకాశం లేక పోలేదంటూ ప్రచారం మొదలు పెట్టాయి.
అయితే తమిళ మీడియా ప్రచారంపై బాలయ్య అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవిత్రుడు, ఏకపత్నీ వ్రతుడైన బాలయ్యను రావణుడితో పోల్చడం ఏమిటి? .....రెండో పెళ్లికి సిద్ధమైన ప్రభుదేవాను, నయనను సీతారాములుగా పోల్చడం ఏమిటి? ఈ మతి లేని ప్రచారం ఏమిటంటూ గుర్రుగా ఉన్నారు.