హాజరే దీక్షకు అనుమతించిన ప్రభుత్వం :సినీ జ్వాల తెలుగు:

Posted on

న్యూఢిల్లీ: అవినీతికి వ్యతిరేకంగా జన లోక్పాల్ బిల్లు కోసం పోరాడుతున్న ప్రముఖ గాంధేయవాది అన్నా హజారే నిరశన దీక్ష చేయడానికి ఎట్టకేలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ విషయమై ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ పార్లమెంటులో మరోసారి ప్రకటన చేస్తారు. జెపి పార్కులో అయితే ఏడు రోజులు, రామ్లీల మైదానంలో అయితే 15 రోజులు దీక్షకు అనుమతి ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. జేపీ పార్కు వద్ద దీక్షకు అనుమతించని క్రమంలో హజారేకు రాంలీలా మైదాన్ని కేంద్రం సూచించింది. ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కూడా అనుమతి ఇచ్చింది. దీంతో దీక్షా వేదిక రాంలీలామైదానంకు మారింది. అన్నా హజారే కూడా ఇక్కడ దీక్ష చేసేందుకు అంగీకరించారు.