క్లీన్ చిట్ ఊరట కలిగించింది: రోశయ్య :సినీ జ్వాల తెలుగు:

Posted on

హైదరాబాద్: విశ్రాంత సమయంలో అమీర్‌పేట భూ వ్యవహారం తనను చాలా బాధించిందని మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య అన్నారు. అయితే ఆ కేసులో ఎసిబి తనకు క్లీన్ చిట్ ఇవ్వడం చాలా ఊరట కలిగించిందని అన్నారు. అమీర్‌పేట భూ వ్యవహారంలో తాను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదన్నారు. నిన్న మొన్నటి వరకు క్రియాశీలక రాజకీయాలలో ఉన్నానని అన్నారు. భవిష్యత్తులో తాను పార్టీ నుండి ఎలాంటి పదవులు కోరుకోవడం లేదని అన్నారు.

దేశంలో పేరుకు పోయిన అవినీతిని రూపుమాపటంలో కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందన్నారు. లోక్‌పాల్ బిల్లు ముసాయిదా డ్రాఫ్టును రూపొందించిన వారిలో అన్నాహజారే సైతం ఉన్నారని రోశయ్య అన్నారు. అలాంటప్పుడు ఇప్పుడు అభ్యంతరం సరికాదన్నారు. అయినా కేంద్రం హజారేను గాంధేయవాదిగా చూస్తోందన్నారు. కేంద్రం ప్రయత్నాలు ఫలించి మంచి వాతావరణం ఏర్పడాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.