మొగుడు పై ఎక్కువ ఆశలు పెట్టున్న తాప్సీ :సినీ జ్వాల తెలుగు:

Posted on

ఎన్నో ఆశలు పెట్టుకుని తెలుగు చిత్ర సీమకు వచ్చి వాలిన ఢిల్లీ పక్షి తాప్సికి వింత అనుభవాలు ఎదురవుతున్నాయి. కష్టపడి చేస్తున్న సినిమాలు ప్లాపావుతుంటే ఏదో ఉన్నాంలే అనిపించే సినిమాలు హిట్టై తాప్సికి నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితిని కల్పిస్తున్నాయి. జుమ్మంది నాదం చిత్రం తో తెలుగు తెరకు పరిచయమయిన ఢిల్లీ భామ తాప్సి ఆ చిత్రం అంతగా విజయవంతమవకపోయినా యువతలో గ్లామర్ క్వీన్ గా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత విడుదలయిన వస్తాడు నా రాజు ఫ్లాప్ అయ్యి తాప్సి కెరీర్ ను ప్రమాదంలో పడేసింది. అలాంటి సమయంలో మిస్టర్ పెర్ఫెక్ట్ హిట్ కాస్త ఉరట నిచ్చింది. కానీ అందులో అమ్మడిది రెండో కధానాయకి పాత్ర కావటంతో సక్సెస్ లో ఎక్కువ భాగం కాజల్ కే దక్కింది.

మనసుకు నచ్చినవారితో ఎంతసేపు ఉన్నా టైమ్‌ తెలీదు. షూటింగ్‌ లో ఎక్కువసేపు ఉండాలంటే బోర్‌ కొడుతుంది. అదే బాగా నచ్చివాడు ఉంటే చెప్పక్కర్లేదు. టైమే తెలీదంటోంది తాప్సి. మిస్టర్‌ ఫర్‌ ఫెక్ట్‌ లో ప్రభాస్‌ తో చేసినప్పుడు అనుభవాల్ని ఒకసారి నెమరేసుకుంది. 'ఆయన్ను చాలామంది రెబల్‌ అంటారు. గంభీరగా ఉంటారనుకున్నాను. కానీ చాలా సరదాగా నాతో ఉన్నారు. మ్యాగీ పాత్ర బాగా నచ్చిన పాత్ర. ఆయనతో ఉన్నారంటే టైమ్‌ ఇట్టే అయిపోతుంది' అంటోంది.

తాజాగా గోపీచంద్‌తో 'మొగుడు' చిత్రంలో నటిస్తోంది. మీ మొగుడు ఎలా ఉన్నాడంటే... ఫక్కున నవ్వేసి.. నా మొగుడు బాగానే యాక్ట్‌ చేస్తున్నాడు. ఇందులో నేను రాజకీయనాయకుడి కూతురుగా నటిస్తున్నాను. గోపీచంద్‌ పెక్యులర్‌ పర్సన్ అని చెబుతోంది. పెక్యులర్‌ అంటే ఏమిటో... అడిగితే... సినిమాలో చూడండి అంటోంది. అమ్మాయిలను అందంగా చూపించడంలో అందెవేసిన చేయి అయిన కృష్ణవంశీ చేతిలో అయినా తన అదృష్టం మారతుందేమో అనే పిచ్చినమ్మకంతో గోపీచంద్ హీరోగా రూపొందుతున్న మొగుడు సినిమా మీదే ఆశలన్ని పెట్టుకుంది తాప్సి.