ఆరోపణలకు హజారే సమాధానం చెప్పాలి మనీష్ :సినీ జ్వాల తెలుగు:

Posted on

న్యూఢిల్లీ: ప్రముఖ సంఘసేవకుడు అన్నాహజారే అవినీతిపరుడని ఎఐసిసి అధికార ప్రతినిధి మనీష్ తివారీ మండిపడ్డారు. జస్టిస్ సావంత్ కమిషన్ నివేదికలో అన్నాహజారే అవినీతి, అక్రమాలను పేర్కొన్నట్లు ఆయన తెలిపారు. పారదర్శకత, నైతికత అని జపం చేస్తున్న అన్నా హజారే తనపై వచ్చిన ఆరోపణలకు సమాధానం చెప్పాలన్నారు. లోక్పాల్ ఇప్పుడు పార్లమెంటు పరిధిలో ఉందని చెప్పారు. ఈ బిల్లు విషయంలో ప్రభుత్వం చేయవలసిందంతా చేసిందన్నారు. ప్రధానిని అవమానపరిచే విధంగా హజారే మాట్లాడుతున్నారని, అది మంచి పద్దతికాదని మనీష్ తివారీ అన్నారు.