హైదరాబాద్: అవినీతిపై ఉద్యమం చేస్తున్న సామాజిక సంఘ సంస్కర్త అన్నా హజారే దీక్షలకు కేంద్రం షరతులు విధించడాన్ని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తప్పుపట్టారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో నిరసనలు చేసుకునే హక్కు ఉంటుందన్నారు. అన్నా హజారే దీక్షకు కేంద్రం షరతులు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. దేశ ప్రతిష్టను పూర్తిగా మంతగాలిపింది కాంగ్రెస్సేనని ఆయన ధ్వజమెత్తారు. అవినీతిపై ఉద్యమం చేసేవాళ్ళని అణచివేయాలనుకుంటే ప్రభుత్వంపై వ్యతిరేకత ఎక్కువై తిరుగుబాటుకు దారితీస్తుందని హెచ్చరించారు. పటిష్టమైన లోక్ పాల్ బిల్లును తీసుకురావాలని ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు. దేశంలో అవినీతి పెరిగిపోయిందన్నారు. కోర్టులు కలుగ జేసుకోవడం వల్లనే అవినీతి, అక్రమాలపై విచారణలు జరుగుతున్నాయన్నారు. అవినీతిపై ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ వ్యాఖ్యలు హాస్యాస్పదం అన్నారు.
తెలంగాణ గురించి మాట్లాడుతూ తెలంగాణపై పరిష్కారం చూపాల్సింది కేంద్రమేనన్నారు. అఖిలపక్ష సమావేశాలకు హాజరు కామని గతంలోనే చెప్పామని, ఇప్పుడూ చెబుతున్నామని తెలిపారు. రైతు సమస్యలపై వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రయత్నించడం లేదని చంద్రబాబు విమర్శించారు. పంట విరామాన్ని ప్రకటిస్తున్న రైతుల వద్దకు వెళ్లి మాట్లాడలేని చేతకాని స్థితిలో ముఖ్యమంత్రి ఉన్నారన్నారు. సోమవారం జరిగే టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో రైతు సమస్యలు, లోక్పాల్ బిలుపై చర్చ జరుగుతుందని చెప్పారు.