హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ మరోసారి ప్రజలను మోసం చేసిందని తెలంగాణ పొలిటికల్ జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ నేతలు రాజీనామాలకు కట్టుబడి ఉండకపోతే గ్రామాల్లో తిరగనిచ్చేది లేదని హెచ్చరించారు. తెలంగాణ ప్రజా ప్రతినిధులు రాజీనామా చేసి వస్తేనే ఉద్యమంలోకి ఆహ్వానిస్తామని కోదండరామ్ తెలిపారు. రాజీనామాలు చేయని కాంగ్రెస్ నేతలను నిలదీయాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణపై చిత్తశుద్ధి లేకనే తెలంగాణ మంత్రులు విధులకు హాజరు అవుతున్నారని కోదండరామ్ మండిపడ్డారు.