న్యూఢిల్లీ : అన్నా హజారే అరెస్ట్‌పై ప్రధానమంత్రి వ్యాఖ్యలు బాధాకరమని రాజ్యసభ విపక్ష నేత అరుణ్ జైట్లీ అన్నారు. ఆయన రాజ్యసభలో ప్రధాని వివరణ అనంతరం మాట్లాడుతూ దీక్ష ఎప్పుడు చేయాలి... ఎక్కడ చేయాలి, ఎన్ని రోజులు చేయాలనేది ప్రభుత్వం నిర్ణయిస్తుందా అని ప్రశ్నించారు. రాజకీయ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం పోలీసులను వాడుకుంటోందని జైట్లీ విమర్శించారు. రాజకీయ సమస్యలను రాజకీయంగానే పరిష్కరించాలన్నారు. ప్రధాని ప్రకటన తమకు సంతృప్తిని ఇవ్వలేదని ఆయన అన్నారు.
అన్నా అరెస్ట్‌పై దేశ వ్యాప్తంగా ప్రజలు నిరసన తెలిపారని ఆయన పేర్కొన్నారు. అవినీతిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వానికి సంకల్పం ఉందా అని జైట్లీ ప్రశ్నించారు. ప్రధాని ప్రకటనలో కొత్తదనమేమీ లేదని, అవినీతిని అంతమొందించేదుకు యూపీఏ సర్కార్‌కు చిత్తశుద్ధి లేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. సమస్యకు పరిష్కారం వెతకడంలో ప్రభుత్వం విఫలమయిందన్నారు. హజారే ఆందోళనలలోరాజకీయాలు లేవని స్పష్టం చేశారు. అవినీతితో ప్రజలు విసిగిపోయారన్నారు. అందుకే అవినీతికి వ్యతిరేంగా ఉద్యమిస్తున్నారని ఆయన చెప్పారు. దేశాన్ని ఎవరు పాలిస్తున్నారో అర్థం కావడం లేదని ఆయన మండిపడ్డారు.