లవకుశ అనే పేరు పెట్టేందుకు సాహసించలేకపోయాం. అందుకే 'శ్రీరామరాజ్యం' అని నామకరణం చేశాం. ఈ చిత్రం మరో 'లవకుశ' అని చెప్పుకోవచ్చు. శ్రీరామచంద్రుని ఆశీస్సులు అందుకోవాలనే భద్రాచలంలో పాటల పండగను ఏర్పాటుచేశాం. మా నాన్నగారు శ్రీరాముని పాత్రకు నిఘంటువులాంటివారు. అందులోంచి కొన్ని భాగాల్ని తీసుకోని ఈ పాత్రను పోషించాను అన్నారు నంగమూరి బాలకృష్ణ. శ్రీ సీతారాముల నిలయమైన భద్రాద్రి దివ్య క్షేత్రంలో శ్రీరామరాజ్యం సినిమా ఆడియో ఆవిష్కరణ సోమవారం రాత్రి కన్నుల పండువగా జరిగింది.ఈ సందర్బంగా బాలకృష్ణ ఇలా స్పందించారు. ఈ ఆడియో ఆవిష్కరణలో బాలకష్ణ సీడీని ఆవిష్కరించి, తొలి సీడీని శ్రీసీతారామ చంద్రస్వామివారి ఆలయ ఇన్‌చార్జ్ ప్రథానార్చకులు పొడిచేటి జగన్నాథాచార్యులు, అర్చకులు కోట్జకృష్టమా చార్యులకు అందజేశారు.
అలాగే ..భారతీయ సంస్కృతిసంప్రదాయాలకు దర్పణం... రామాయణం. అందుకు సంబంధించిన చిత్రంలో శ్రీరాముని పాత్రను పోషించడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది. ఇళయరాజా బాణీలు సినిమాకు వెన్నుదన్నుగా నిలుస్తాయి. అక్కినేని నాగేశ్వరరావుగారు నాకు బాబాయ్. ఆయన వాల్మీకి పాత్రలో నటించడం ఎంతో ఆనందాన్నిచ్చింది. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. సీత పాత్రకు నయనతారను ఒప్పించాను.జన్మలో ఒకసారి మాత్రమే ఇలాంటి అవకాశం వస్తుంది. మన నటనకు సార్థకత కలుగుతుంది అని చెప్పాను.. లక్ష్మణుని పాత్రకు శ్రీకాంత్‌ని నేనే సూచించాను. బాపు గురించి నేను చెప్పడం కాదు.. ప్రపంచమంతా చెబుతుంది. ఆయన ఎక్కువ మాట్లాడరు. కుంచెతో గొప్ప కళాఖండాల్ని ఆవిష్కరిస్తారు అన్నారు.
నయనతార మాట్లాడుతూ ఈ చిత్రంలో నటించేందుకు అవకాశం కల్పించిన దర్శకనిర్మాతలకీ చిత్ర బృందానికీ కృతజ్ఞతలు తెలిపారు. ''ఇది దైవ సంకల్పం. మా తల్లితండ్రులు, కుటుంబ సభ్యులు రామభక్తులు. భక్తిప్రపత్తులతో ఈ చిత్రాన్ని నిర్మించామ''ని నిర్మాత యలమంచిలి సాయిబాబు చెప్పారు. అక్కినేని నాగేశ్వరరావు ప్రసంగిస్తూ ''హింస, అరకొర దుస్తుల భామలు చేసే నృత్యాలున్న సినిమాల్ని చూస్తున్నారు. ఇలాంటి సమయంలో భక్తిభావ చిత్రాలు తీస్తే ఎవరు చూస్తారని నిర్మాతని హెచ్చరించాను. ఆయన నన్ను ఒప్పించిన తీరుని మరచిపోలేను. సీతగా నయనతార ఒదిగిపోయిందన్నారు.
ఇళయరాజా మాట్లాడుతూ ''సంగీతం గురించి ఎవరైనా మాట్లాడగలరా? ఎందుకంటే దాని ఎల్లలు లేవు. ఈ సినిమా కోసం పాట రాశాక బాణీలు చేశాను. మూడు పాటల్ని కేవలం పదిహేను నిమిషాల్లో సిద్ధం చేశాను. తెలుగులో తొలిసారి పౌరాణిక చిత్రానికి సంగీతం సమకూర్చాను'' అన్నారు. చిత్రంలోని పాటలను జొన్నవిత్తుల రచించారు. ఈ కార్యక్రమంలో సినీ ప్రముఖులు శ్రీకాంత్, మురళీమోహన్, పరుచూరి గోపాలకృష్ణ, బోయపాటి శ్రీను, ఎమ్.బాలయ్య తదితరులు పాల్గొన్నారు.