కందిరీగ హిట్టుతో జోరు మీదున్న రామ్ ఆ నిర్మాత బెల్లంకొండ సురేష్ కి మళ్లి సినిమా చేయకూడదని నిర్ణయించుకున్నాడని తెలుస్తోంది. దానికి కారణం రెమ్యునేషన్ విషయంలో బెల్లంకొండ ఇబ్బంది పెట్టడమేనంటున్నారు. గతంలోనూ ప్రియమణి విషయంలోనూ అదే జరిగింది. సినిమా కమిటయ్యేటప్పుడు అనుకున్న మొత్తం ఆ తర్వాత ఇవ్వడని చెప్తున్నారు. ఇదే విషయమై రామ్ కి బ్యాలెన్స్ ఎమౌంట్ ఇవ్వకుండా ఎగ్గొట్టే ప్రయత్నం చేసాడని తెలుస్తోంది. దాంతో రామ్ ఆ విషయాన్ని సినిమా పెద్దల వద్దకు తీసుకెళ్ళి సెటిల్ చేసుకున్నాడు.
అంతేగాక బెల్లంకొండతో సినిమా చేయటం అనవసరసమనే నిర్ణయానికి వచ్చాడు. లేకపోతే నిజానికి బెల్లంకొండతో తదుపరి చిత్రం గౌతమ్ మీనన్ దర్శకత్వంలో చేయాల్సి ఉంది. దానికి నో చెప్పేసాడని తెలుస్తోంది. ఇక కందిరీగ విషయానికి వస్తే మొన్న శుక్రవారం విడుదలైన ఈ చిత్రం కలెక్షన్స్ పరంగా బాగా వీకెండ్, శెలవు బాగా కలిసివచ్చింది. హిట్ టాక్ రావటం, దడ సినిమా డిజాస్టర్ కావటంతో ఈ సినిమాకు తిరుగులేదని చెప్తున్నారు.