కరెక్ట్ కాదని తర్వాత తెలిసింది - హన్సిక :సినీ జ్వాల తెలుగు:

Posted on

మొదట్లో నాకు తొందర ఎక్కువ ఉండేది. ఎక్కువ సినిమాలు చేసేయాలని తాపత్రయపడేదాన్ని. ఆ తొందరపాటుతనం కరెక్ట్ కాదని తర్వాత తెలుసుకున్నాను అంటోంది హాట్ స్టార్ హన్సిక. ఆమె హీరోయిన్ గా చేసిన ‘కందిరీగ’ చిత్రం విజయవంతం అవటంతో ఆమె మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించింది. హించానని హన్సిక అన్నారు. అలాగే నేను ఏ సినిమా అయినా ముందు అమ్మతోనే కలిసి చూస్తాను. నా తొలి విమర్శకురాలు మా అమ్మే. ఈ సినిమా చూడగానే పెద్ద హిట్ అవుతుందని చెప్పింది అమ్మ. అదే నిజం అయ్యింది అంది.

ఇక నేను ఎంత పెద్ద హీరోయిన్‌ని అయినా ఇప్పటికీ అమ్మ కూచినే. నేను నటించే సినిమాల విషయంలో అన్నీ అమ్మే చూసుకుంటుంది. కానీ కథ విషయంలో మాత్రం నేనే నిర్ణయం తీసుకుంటా. ఆ తర్వాత అమ్మకు చెబుతా.‘కందిరీగ’ విషయంలో అమ్మ కూడా చాలా హ్యాపీగా ఉంది.ఇప్పుడు ఆచితూచి సినిమాలు ఒప్పుకుంటున్నాను. నాకిపుడు జస్ట్ ట్వంటీ. సో... ఇంకా పదేళ్ల పాటు టాప్ హీరోయిన్‌గా కెరీర్ సాగించగలననే నమ్మకం నాకుంది అని మురిసిపోతూ చెప్పింది.‘కందిరీగ’లోని తన పాత్రకు మంచి స్పందన వస్తోందని, ఈ విజయం తాను ముందే ఊహించానంది.