మహేష్ బాబు, ఎన్టీఆర్ ఫోన్లు చేసి మరీ అభినందించారు. ఈ సక్సెస్ క్రెడిట్ యూనిట్ మొత్తానిది అంటున్నారు హీరో రామ్.రామ్ హీరోగా నటించిన 'కందిరీగ' శుక్రవారం విడుదలైంది. ఈ సినిమా విజయం సాధించిన ఆనందంతో రామ్ మీడియాతో మాట్లాడుతూ "15 నెలలు గ్యాప్ తీసుకుని ఈ సినిమా చేశా. 'రెడీ' కన్నా పెద్ద హిట్టని అందరూ అంటున్నారు.ఈ పదిహేను నెలలు ‘నరకం ట్రైలర్’ చూశాను. కొందరైతే ఇంత గ్యాప్ తీసుకుంటే జనాలు మరచిపోతారు అని భయపెట్టారు కూడా అని చెప్పుకొచ్చారు.
అలాగే ఈ దఫా హిట్ అనేది కొడితే... దాని సౌండ్ నాలుగు రాష్ట్రాలకు వినిపించాలి అని కలలు కన్నాను. ఆ కలను నిజం చేసింది ‘కందిరీగ’. అప్పుడే ఈ సినిమా రీమేక్ రైట్స్ కోసం పరభాషా నిర్మాతలు పోటీ పడుతున్నారు అన్నారు రామ్. ఏ, బీ, సీ అని తేడా లేకుండా, ఆల్ సెంటర్స్‌లో వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఓవర్సీస్‌లో అయితే పదమూడు స్క్రీన్స్‌లో రూ. 70 లక్షలు వసూలు చేసింది. నా సినిమాకు ఈ స్థాయిలో రావడం ఇదే ప్రథమం.
హన్సిక గురించి మాట్లాడుతూ ‘మస్కా’ టైమ్‌లో ఆ అమ్మాయి చాలా చిన్నపిల్ల. ఈ సినిమా టైమ్‌కి మానసికంగా చాలా ఎదిగింది. నటన పరంగా ఎంతో అనుభవం గడించింది. మా ఇద్దరి కాంబినేషన్ సీన్లను యూత్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు అని చెప్పారు. ప్రస్తుతం కరుణాకరన్ ‘ఎందుకంటే ప్రేమంట’ సినిమా చేస్తున్నానని, ఒక షెడ్యూల్ కూడా అయ్యిందని, ఆ సినిమా తర్వాత గౌతమ్‌మీనన్ సినిమా ఉంటుందని రామ్ చెప్పారు.