దానాలన్నిటిలోకీ నేత్రదానం గొప్పదంటారు. గొప్ప మనసున్న వాళ్లే నేత్రదానం చేసి, మరో ఇద్దరికి చూపుని ప్రసాదించగలుగుతారు. తనకూ అటువంటి మనసుందని నిరూపించాడు యువ కథానాయకుడు శర్వానంద్. లిటిల్ వేస్ ఫౌండేషన్ అనే స్వచ్చంద సంస్థ ఈ రోజు హైదరాబాదు బంజారా హిల్స్ లోని కేబీఆర్ పార్కు వద్ద నిర్వహించిన ఓ కార్యక్రమంలో, మరణానంతరం తన రెండు కళ్ళను దానం చేస్తున్నట్టుగా శర్వానంద్ రాసిచ్చాడు. నేత్ర దానం చేసి చీకట్లో వున్న వారికి వెలుగును ప్రసాదించాలని ఆయనీ సందర్భంగా విజ్ఞప్తి చేశాడు. తన తల్లిదండ్రులు కూడా నేత్రదానం చేశారని శర్వానంద్ చెప్పాడు.