'లీడర్' సినిమాతో తెలుగులో కథానాయికగా పరిచయమైన రిచా గంగోపాధ్యాయకు తెలుగులో ఇంకా టైం రాలేదనే చెప్పాలి. మిరపకాయ్, నాగవల్లి సినిమాల తర్వాత తన దశ మారిపోతుందని రిచా ఆశించినా, అది అడియాశే అయింది. తెలుగులో ఆఫర్లు లేకపోవడంతో ప్రస్తుతం తమిళంలో శింబుతో 'దబాంగ్' రీమేక్ అయిన 'ఓస్తీ' సినిమాలో నటిస్తోంది. ఈ నేపథ్యంలో రిచాకు తెలుగులో తాజాగా ఓ ఆఫర్ వచ్చింది. కమేడియన్ సునీల్ హీరోగా నటించే ఓ సినిమాలో ఆమెకు హీరోయిన్ గా చాన్స్ వచ్చిందట. అవకాశం రావడమే అదృష్టంగా భావించిన రిచా, ఇక వెనకా ముందూ ఆలోచించకుండా వెంటనే ఒప్పేసుకుందట. దీనికి సంబంధించిన వివరాలు త్వరలో తెలుస్తాయి.