ఆటోనగర్ సూర్య లేటెస్ట్ ఇన్పో :సినీ జ్వాల తెలుగు:

Posted on

నాగచైతన్య,దేవకట్టా కాంబినేషన్ లో రూపొందనున్న ఆటోనగర్ సూర్య చిత్రం అక్టోబర్ ఆరవ తేదిన రెగ్యులర్ షూటింగ్ తో ప్రారంభం కానుంది. ప్రస్తుతం ప్రి ప్రొడక్షన్ లో బిజీగా ఉన్న ఈ చిత్రం కోసం ఓ సెట్ ని షూటింగ్ కోసం రెడీ చేస్తున్నారు. ఈ విషయాన్ని దర్శకుడు దేవకట్టా కన్ఫర్మ్ చేస్తూ... ఆటో నగర్ సూర్య సెట్ కనస్ట్రక్షన్ జరుగుతోంది. అక్టోబర్ ఆరు నుంచి షూటింగ్ ప్రారంభించి.. వేసవిలో విడుదల చేస్తాం. ఇక ఈ చిత్రంలో సమంత హీరోయిన్ గా చేస్తోంది.

ఈ చిత్రం బెజవాడ నేఫధ్యంలో ఓ మాస్ ఎంటర్టైనర్ గా చిత్రాన్ని రూపొందించనున్నారు. ఇప్పటికే ఆటో నగర్ సూర్యగా దేవకట్టా విడుదల చేసిన ఆడియో టీజర్ అందరనీ ఆకట్టుకుంది. ఈ చిత్రం జూన్ నుంచి షూటింగ్ కి వెళ్ళనుంది. ఇక ఈ చిత్రంలో నాగచైతన్య విజయవాడ ఆటో నగర్ ఏరియాకు చెందిన రౌడీగా కనపించనున్నారు. ఈ చిత్రంలో నాగచైతన్య పాత్ర అయాన్ రాండ్ పాపులర్ నవల.. ది పౌంటెన్ హెడ్ లోని హోవర్డ్ రోర్క్ పాత్రను పోలి ఉంటుందని దేవకట్టా చెప్తున్నారు.

ఆటోనగర్ సూర్య పాత్ర హోవర్డ్ రోర్క్ పాత్రకు స్క్రీన్ పై యాక్షన్ వెర్షన్. ఎలక్ట్రికల్ బల్బ్ అనేది ఎంత పాజిబులో.. హోవర్డ్ రోర్క్ అనే పాత్ర భూమిపై అంతే సహజం.మనందరిలోనూ ఆ పాత్ర ఉంది అన్నారు. ఇక ఆ పాత్ర చాలా ఐడియలిస్ట్ గా ఉంటూ తాను నమ్మిన విలువలకు దేనికీ కాంప్రమైజ్ కాకుండా ఏం జరిగినా ఫరవాలేదు అన్న కోణంలో ముందుకెళ్తూంటాడు. ఈ చిత్రానికి నిర్మాత: కె.అచ్చిరెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:దేవాకట్టా.