న్యూఢిల్లీ : అన్నా హజారే అరెస్ట్‌పై ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ చేసిన ప్రకటనపై విపక్షాలు మండిపడ్డాయి. ప్రధాని ప్రకటనపై స్పీకర్ మీరాకుమార్ చర్చకు అనుమతి ఇచ్చారు. ఈ సందర్భంగా విపక్ష నేత సుష్మా స్వరాజ్ మాట్లాడుతూ సభలో ప్రధాని లేకుండా చర్చించేది లేదని, అవసరం అయితే సభను వాయిదా వేయాలని ఆమె స్పీకర్‌ను కోరారు. కాగా హజారే అరెస్ట్‌పై లోక్‌సభలో ప్రకటన అనంతరం ప్రధానమంత్రి రాజ్యసభలో వివరణ ఇచ్చేందుకు వెళ్లారు. దీనిపై విపక్షాలు అభ్యంతరం తెలిపాయి. చర్చ ముగిసే వరకూ ప్రధాని సభలోనే ఉండాలని విపక్షసభ్యులు పట్టుబట్టారు. బీజేపీ అగ్రనేత ఎల్ కె అద్వానీ మాట్లాడుతూ ప్రభుత్వం విఫక్షాల గొంతు నొక్కేస్తోందన్నారు. చట్టసభల్లో అర్థవంతమైన చర్చ జరగకుండా సర్కార్ అడ్డుపడుతోందని ఆరోపించారు. కాగా, సభ సజావుగా సాగే పరిస్థితి లేకపోవటంతో స్పీకర్ మీరాకుమార్ లోక్‌సభను అరగంటపాటు వాయిదా వేశారు. అంతకు ముందు రాజ్యసభ కూడా అరగంటపాటు వాయిదా పడింది.