హైదరాబాద్ : పంద్రాగస్టు నాడు జాతీయ జెండాతో పాటు తెలంగాణ జెండాను కూడా ఎగురవేస్తామని టీ-కాంగ్రెస్ ఎంపీలు స్పష్టం చేశారు. అనుకున్న ఆశయం సాధించే వరకు పార్లమెంట్‌కు హాజరు అయ్యేది లేదని వారు చెప్పారు. మంత్రులు విధులకు దూరంగా ఉంటారని తెలిపారు. రాజీనామాల విషయంలో రాజీలేదన్నారు. ఈ రోజు ఎంపీ కేశవరావు ఇంట్లో టీకాంగ్రెస్ స్టీరింగ్ భేటీ నిర్వహించారు. రేపు(సోమవారం)ఉదయం గన్‌పార్క్ వద్ద అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించిన అనంతరం తెలంగాణ జెండాను ఆవిష్కరిస్తామని వారు తెలిపారు. టీ-ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు పలువురు మంత్రులు పాల్గొన్నారు.