మెదక్: స్వాతంత్ర భారతం ఆవిర్భవించడంలో ప్రధాన భూమిక పోషించి జాతిపితగా, మహాత్ముడిగా ప్రపంచ దేశాల మన్ననలు అందుకుంటున్న గాంధీ విగ్రహాన్ని కొందరు దుండగులు రాష్ట్రంలో రెండు చోట్ల ఆదివారం ధ్వంసం చేశారు. స్వాతంత్ర దినోత్సవ దినం అయిన ఆగస్టు పదిహేనుకు ఒక్క రోజు ముందు ఆ మహానుభావుడి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఈ దుర్ఘటన మెదక్ మరియు తూర్పు గోదావరి జిల్లాలలో చోటు చేసుకుంది. దీంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహాత్ముడి విగ్రహాలను ఎవరు ధ్వంసం చేశారా అని కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.