సుప్రీం ను ఆశ్రయించిన జగన్‌ :సినీ జ్వాల తెలుగు:

Posted on

న్యూఢిల్లీ: తన ఆస్తులపై పూర్తిస్థాయి విచారణ చేయాలని సీబీఐకి హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను నిలుపుదల చేయాలని కోరుతూ మంగళవారం వైఎస్‌ఆర్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సుప్రీం కోర్టులో పిటీషన్‌ దాఖలు చేశారు. జగన్‌ ఆస్తులు, ఎమ్మార్‌ అక్రమాలపై సీబీఐ ప్రాథమిక విచారణ చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై కోర్టు స్పందించింది. పూర్తి స్థాయి విచారణ చేయాలని సీబీఐని ఆదేశించింది. దీంతో జగన్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.